శృతి హాస‌న్ కోసం ప్ర‌భాస్ ఏకంగా..!?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సెట్స్ లోని అందరితో కలుపుగోలుగా మాట్లాడుతుంటారు. ఆహార ప్రియుడైన ఆయన తాను నటించే ప్రతి మూవీ సెట్‌కి వెరైటీ వంట‌కాలు తెస్తుంటారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న స‌లార్ సినిమా సెట్స్ కి కూడా రకరకాల వంటకాలు తీసుకొచ్చారట. ఈ మూవీలో కథానాయకగా నటిస్తున్న శ్రుతిహాస‌న్ కోసం ఏకంగా 20 రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి ఆశ్చర్యపరిచారట.

ఈ విషయాన్ని శ్రుతిహాస‌న్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రభాస్ తన కోసం స్పెషల్ గా తీసుకొచ్చిన అన్ని వంటకాల పేర్లను ఆమె తెలిపారు. ప్ర‌భాస్ తనకోసం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, గోంగూర మాంసం, కబాబ్, రకరకాల పప్పులు, సాంబార్, కర్రీలు తెచ్చారని ఆమె పేర్కొన్నారు. తన కోసం రుచికరమైన వంటకాలు తీసుకువచ్చినందుకు ప్రభాస్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.

Share post:

Latest