బ్లాస్ట్ అయిన `సర్కారువారి పాట బ్లాస్ట‌ర్‌`..ఇదీ లెక్కంటే!!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌కత్వంలో `స‌ర్కారు వారి పాట‌` అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌నవరి 13న విడుద‌ల చేయ‌నున్నారు.

- Advertisement -

ఇక నిన్న మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సర్కారువారి పాట బ్లాస్ట‌ర్ పేరుతో టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అయితే అంద‌రూ ఊహించిన‌ట్టుగానే ఈ బ్లాస్ట‌ర్ అద్భుతంగా బ్లాస్ట్ అయ్యి.. మ‌హేష్ ఖాతాలో కొత్త రికార్డు వ‌చ్చి ప‌డేలా చేసింది.

యూట్యూబ్‌లో టీజ‌ర్‌ను అలా వ‌దిలారో లేదో.. జెట్ స్పీడ్‌లో దూసుకుపోయి విడుద‌లైన 24 గంటల్లోనే 25.7 మిలియన్ వ్యూస్ ను, 754K లైక్స్ ను సాధించింది. దాంతో అతి త‌క్కువ స‌మ‌యంలో అత్య‌ధిక వ్యూస్ రాబ‌ట్టిన టీజ‌ర్‌గా సర్కారువారి పాట బ్లాస్ట‌ర్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇక లైక్స్ పరంగా ఆల్ టైం టాప్ 4 లో నిలిచినట్టు తెలుస్తుంది.

Share post:

Popular