`సర్కారు వారి పాట బ్లాస్టర్ `..మ‌హేష్ అద‌ర‌గొట్టేశాడంతే!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ప‌రుశురామ్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌నవరి 13న విడుద‌ల చేయ‌నున్నారు.

- Advertisement -

అయితే ఈ రోజు మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఉదయం 9 గంటల తొమ్మిది నిమిషాలకు `సర్కారు వారి పాట బ్లాస్ట‌ర్‌` పేరుతో టీజర్ ను విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఉన్నట్టుండి ఈ టీజర్ ను రాత్రి 12 గంటలకు విడుదల చేసి అందరినీ షాక్ అయ్యేలా చేశారు. `ఇందు మూలంగా యావన్ మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా.. ` అంటూ మహేష్ బాబు ఎంట్రీని టీజ‌ర్‌లో అద్భుతంగా చూపించారు.

అలాగే రౌడీల‌ను తుక్కు రేగ‌కొట్టిన మ‌హేష్‌.. `ఇఫ్ టైగర్ టేక్స్ రాబిట్.. ఇఫ్ యూ మిస్ ద ఇంట్రస్ట్.. యువిల్ గెట్ యువర్ డేట్` అని డైలాగ్స్ చెబుతూ అద‌ర‌గొట్టేశాడు. ఇక‌ కీర్తి సురేష్, మ‌హేష్‌ల మ‌ధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా సూప‌ర్‌గా ఉంటుంద‌ని తాజాగా విడుద‌ల చేసిన టీజ‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న సర్కారు వారి పాట బ్లాస్టర్ ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది.

Share post:

Popular