‘సలార్’ సెట్స్ లో శృతి.. ఫోటోస్ వైరల్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్నాడు. సాహో విడుదల తరువాత తన కెరీర్‌లో మ‌రింత వేగం పెంచాడు ప్రభాస్. రాధేశ్యామ్ షూటింగ్ దాదాపుగా పూర్తి చేశారు. రాధాకృష్ణ కుమార్ తీస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్ర‌భాస్ న‌టిస్తోన్న మ‌రో సినిమా ఆదిపురుష్. ఈ సినిమా కూడా ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ రాముడిగా న‌టిస్తున్నాడు.

కేజీఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న భారీ మాస్ యాక్షన్ చిత్రం స‌లార్‌. హోంబలె ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా షూట్ ప్రస్తుతం హైదరాబాద్ లో జ‌రుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ న‌టిస్తోంది. ఈ సినిమాకు రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల ఈ భారీ మూవీ షూట్ లో ఈ మ‌ధ్య‌నే శృతి హాసన్ జాయిన్ అయింది. ఈ మ‌ధ్య షూటింగ్ స్పాట్ నుండి దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ఆమె ఫోటో దిగింది. ఆ ఫోటో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రభాస్ తో పాటు హీరోయిన్ శృతి క్యారెక్టర్ కూడా చాలా బాగుటుంద‌ని టాక్‌. తప్పకుండా ఈ సినిమా భారీ హిట్ కొట్టడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest