త‌మ‌న్ మాస్ బీట్స్ `అఖండ‌` కోస‌మేనా..వీడియో వైర‌ల్‌!

స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.త‌మ‌న్ సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఎప్ప‌టిక‌ప్పుడు తాను ప‌ని చేస్తున్న సినిమాల ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటాడు త‌మ‌న్‌. అయితే తాజాగా ఓ వీడియోను ట్విట్ట‌ర్ ద్వారా పోస్ట్ చేశాడు.

Boyapati Srinu begins budget cutting measures for Balakrishna film - tollywood

 

ఈ వీడియోలో త‌మ‌న్ తన గురు డ్రమ్ స్పెషలిస్ట్ శివమణితో మాస్ డ్రమ్ సెషన్ లో పాల్గొన్నాడు. పైగా అందులో సింహం కూడా కనిపిస్తుండంతో ఈ సెషన్ అఖండ సినిమా కోసమే అయ్యుంటుందని నంద‌మూరి ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. కాగా, ప్ర‌స్తుతం త‌మ‌న్ సంగీతం అందిస్తున్న చిత్రాల్లో అఖండ ఒక‌టి.

Akhanda - Official Trailer | Telugu Movie News - Times of Indiaబాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మూడో చిత్ర‌మిది. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. పూర్ణ‌, శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిత‌మ‌వుతున్న‌ ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల కానుంది.

https://twitter.com/MusicThaman/status/1430590657467322375?s=20