చీర‌, త‌ల‌పై పాగాతో ఆక‌ట్టుకుంటున్న ర‌ష్మిక‌..పిక్స్ వైర‌ల్‌!

ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ర‌ష్మిక మంద‌న్నా.. మొద‌టి సినిమాతోనే హిట్ అందుకుని అంద‌రి చూపుల‌ను త‌న‌వైపుకు తిప్పుకుంది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ర‌ష్మిక‌.. తెలుగు సినిమాలే కాకుండా క‌న్న‌డ‌, త‌మిళం మ‌రియు హిందీ భాష‌ల్లోనూ న‌టిస్తోంది.

Image

ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌, చెన్నై, ముంబై అంటూ షూటింగ్ కోసం క్ష‌ణం తీరిక లేకుండా తిరుగుతోంది. అయితే సినిమాతో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాను మాత్రం వ‌ద‌ల‌దు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు సంబంధించిన ఫొటోల‌ను, వీడియోల‌ను షేర్ చేస్తూ త‌న ఫాలోవ‌ర్స్‌ను అల‌రిస్తుంటుంది.

Image

ఇక తాజాగా కూడా ర‌ష్మిక కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఈ ఫొటోల్లో చీర ధ‌రించి ఉన్న ర‌ష్మిక‌.. త‌ల‌పై పూల‌తో త‌యారు చేసిన పాగా పెట్టుకుని సూప‌ర్ క్యూట్‌గా ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఈ క్ర‌మంలోనే అభిమానులు మ‌రియు నెటిజ‌న్లు ర‌ష్మిక పిక్స్‌పై లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు. దాంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈమె లేటెస్ట్ పిక్స్ కు 29 ల‌క్ష‌ల‌కు పైగా లైక్స్ వ‌చ్చి ప‌డ్డాయి.

Image