రామ్ చరణ్ తో నటించనున్న కమెడియన్ సునీల్..?

టాలీవుడ్ లో సునీల్ అంటే బ్రహ్మానందం తర్వాత అంతటి కామెడీ చేసే ఏకైక నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈయన హీరోగా ప్రయత్నం చేసి విఫలమయ్యారు అని చెప్పుకోవచ్చు. ఇక సునీల్ ప్రస్తుతం విలన్ లాగా కొన్ని సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక పుష్ప సినిమాలో కూడా ఒక నెగిటివ్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం సునీల్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో సునీల్ ఫుల్ లెంత్ కామెడీ రోల్ లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే శంకర్ సినిమా లో ఎక్కువగా హీరోతో సమానంగా ఉండే పాత్రలే ఉంటాయి. ఇక ఈ చిత్రంతో నైనే సునీల్ అదృష్టం మారుతుందని సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది.

శంకర్ సినిమాలో సునీల్ పాత్రకి న్యాయం చేయగలిగితే మరికొన్ని సినిమా అవకాశాలు వస్తాయని తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో సినిమా అంటేనే భారీ అంచనాలను వేసుకున్నారు తన అభిమానులు. ఇక ఈ సినిమాలో సునీల్ నటించడం అంటే ఒక బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు.

ఇక సునీలు షూటింగ్ సమయంలో ఉన్నప్పుడు డైరెక్టర్ శంకర్ కాల్ చేసి తనకి తన పాత్ర గురించి వివరించి చెప్పినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విచారం ఒక ఐఏఎస్ అధికారిగా, ఒక పోలీస్ అధికారి గా కనిపిస్తాడని వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఏదిఏమైనా ఇప్పుడైనా సునీల్ జాతకం మారుతుందేమో చూడాలి.