జెనీలియా కాపురంపై వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..షాక్‌లో నెటిజ‌న్లు!

త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మైమ‌రిపించిన జెనీలియా..2012న బాలీవుడ్ నటుడు, మహారాష్ట్ర‌ మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ కొడుకు రితేష్ దేవ్ ముఖ్ ని పెద్ద‌ల స‌మ‌క్షంలో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి త‌ర్వాత సినిమాలకు దూరంగా ఉన్న జెనీలియా.. ఫ్యామిలీ లైఫ్‌ను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.

Genelia, Riteish celebrate 17 years of first movie | Genelia and Ritesh  Deshmukh

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జెనీలియా త‌న భ‌ర్త‌, పిల్ల‌ల‌తో త‌ర‌చూ రీల్స్ చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తూ ఉంటుంది. అయితే ఆగస్ట్ 5 జెనీలియా బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా రితేష్‌..భార్యపై ప్రేమను కురిపించాడు. త‌న‌తో గ‌డిపిన కొన్ని మ‌ధుర క్ష‌ణాల‌ను ఓ వీడియో రూపంలో షేర్ చేయ‌గా.. అది కాస్త వైర‌ల్‌గా మారింది.

Dating History revealed! Riteish Deshmukh spills the beans on his love life  with Genelia D'Souza | India.com

అయితే ఈ వీడియోపై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. రితేష్ పోస్ట్ చేసిన వీడియోను రీట్వీట్ చేస్తూ..ఈ ప్రపంచ వ్యాప్తంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న జంట మీది మాత్రమే కావొచ్చు అని వర్మ వ్యాఖ్యానించాడు. అలాగే చివరగా జెనీలియాకు వర్మ బర్త్ డే విషెస్ కూడా చెప్పారు. అయితే పెళ్లిపై వ‌ర్మ ఇంత పాజిటివ్‌గా స్పందించ‌డంతో ప‌లువురు నెటిజ‌న్లు షాక్ అవుతుంటే.. మ‌రికొంద‌రు మాత్రం వ‌ర్మ క‌న్ను జెనీలియా కాపురంపై ప‌డిందని కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Popular