దేవుడి మీద ఒట్టు అది నేను కాదంటున్న వ‌ర్మ‌..మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ట్ రామ్ గోపాల్ వ‌ర్మ అంటే తెలియ‌ని వారుండ‌రు. నిత్యం సమాజంలో చోటుచేసుకునే పరిస్థితులపై త‌న‌దైన శైలిలో కామెంట్లు చేస్తూ వార్త‌ల్లో నిలిచే వ‌ర్మ‌.. ఓ అమ్మాయితో డాన్స్ చేస్తున్న వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.

‘లైఫ్ ఎట్ ఆర్జీవీ కంపెనీ’ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోలో బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్న ఓ అమ్మాయితో వ‌ర్మ ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మ‌ద్యం మ‌త్తులు వ‌ర్మ స‌ద‌రు అమ్మాయిని ఎక్క‌డెక్క‌డో ట‌చ్ చేస్తూ నానా హంగామా చేశాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆర్జీవీపై విమర్శులు గుప్పించారు.

అయితే ఆ వీడియోలో అమ్మాయితో డాన్స్ చేస్తున్నది తాను కాదంటూ తాజాగా వర్మ ట్వీట్ చేశాడు. బాలాజీ, గణపతి, జీసస్ వంటి దేవుళ్లపై ఒట్టు, ప్రమాణ పూర్తిగా ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అంటూ ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఆ వీడియోలో ఉన్నది వర్మ అనేది స్పష్టంగా తెలుస్తున్నా, ఆయన కావాల‌నే సెటైరికల్ ట్వీట్ చేశారు.

Share post:

Popular