రామ్ చరణ్-ఎన్టీఆర్ ల మధ్య చిచ్చు పెడుతున్న బాలీవుడ్ మీడియా…!

ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన ప్రమోషన్ సాంగ్స్ ను ఒకటి విడుదల చేశారు. ఇక ఈ సాంగ్ కూడా ఎంతో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈ పాటకి ఎన్నో లక్షల వ్యూస్ కూడా వచ్చాయి. ఇక ఈ పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి వస్తున్న ఒక సీన్ లో నందమూరి అభిమానులకు జ్యోష్ అందించింది.

ఇప్పుడు ఈ లిరికల్ వీడియో పై ఒక బాలీవుడ్ లో నుంచి ఒక క్రిటిక్ చేసిన కామెంట్స్..ఇప్పుడు నందమూరి అభిమానుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నది. ఈ ప్రమోషన్ సాంగ్ వీడియోలో చరణ్ లుక్ జూనియర్ ఎన్టీఆర్ కన్నా చాలా అందంగా ఉండడంతో , ఆ బాలీవుడ్ క్రిటిక్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కామెంట్స్ రాజమౌళి దృష్టి వరకు వెళ్లినట్లు సమాచారం.

ఈ సినిమాలో కేవలం రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు కనిపించారని.. కేవలం వారి నటననే కనిపిస్తుందని తెలుస్తున్నది. ఈ సినిమా గురించి అనేకసార్లు రాజమౌళి చెబుతూ వచ్చారు. అయితే మెగా నందమూరి అభిమానులు మాత్రం తమ హీరోలలో ఏ ఒక్కరికి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది అనే విషయం వేచి చూడాలి.

టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ చేయడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. ముఖ్యంగా చరణ్, జూనియర్ ఎన్టీయార్ లను కలిపి సినిమాగా తెరకెక్కడం అంటే అంత ఆషామాషీ కాదు.. అందులోనూ ఇద్దరి ఇమేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా సినిమా తీయాలంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Share post:

Popular