రాజ్‌కుంద్రా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు..!

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు బాంబే హై కోర్టులో చుక్కెదురైంది. పోర్నోగ్రఫీ కేసులో ఇటీవల కాలంలో ఆయనను పోలీసులు అరెస్టు చేసిన సంగతి అందరికీ విదితమే. కాగా తన అరెస్ట్‌ చట్టవిరుద్ధమని, తనను వెంటనే విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను శనివారం బాంబే హైకోర్టు కొట్టేసింది. ఫలితంగా అతడు బెయిల్‌ మీద బయటకు వచ్చే చాన్స్ లేకుండా పోయింది. ఇదిలా ఉండగా వ్యాపారవేత్తయైన రాజ్ కుంద్రాపై రోజురోజుకూ ఆరోపణలు చేసే వారు పెరిగిపోతున్నారు. రాజ్‌కుంద్రా తనను పోర్న్ వీడియోలో నటించాలని బెదరించాడని ఓ నటి తెలిపింది.

ఇక ఇప్పటికే పలువురు మోడల్స్ రాజ్ కుంద్రా తమను బలవంతంగా పోర్న్ వీడియోస్‌లో నటించేలా చేశాడని కేసు పెట్టిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. హాట్ షాట్స్ కోసం పలువురు మోడల్స్‌తో రాజ్ కుంద్రా పోర్న్ వీడియోస్ చేసినట్లు పోలీసులు వద్ద ప్రాథమిక ఆధారాలున్నట్లు తెలుస్తోంది. రాజ్ కుంద్రా ఇంటి వద్ద సోదాలు చేసిన పోలీసులు ఇప్పటికే 51 అడల్ట్ మూవీస్, 68 పోర్న్ వీడియోస్‌ను సేకరించారు. ఇంకా విచారణ కొనసాగనున్నట్లు సమాచారం.