పీవీ సింధు కి ఇష్టమైన వంటకం ఏమిటంటే..?

తెలుగు తేజం పీవీ సింధు పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడా సంబురంలో భారత్ జెండాను ఎగురవేసిన సింధు పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని, సీఎంలు, మంత్రులు, సినీ ప్రముఖులు ఆమెను అభినందిస్తుండగా, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆమెను పొగుడుతున్నారు.

- Advertisement -

 

ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారణిగా పీవీ సింధు రికార్డు సృష్టించింది. ఇకపోతే ఆమె టోక్యో నుంచి స్వదేశానికి రాగా ప్రముఖులు, కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులు ఆమెకు స్వాగతం పలికారు. పతకం సాధించిన సందర్భంగా ఆమె మీడియతోనూ ముచ్చటించింది. రెండు సార్లు మెడల్ సాధించడం పట్ల తనకూ ఆనందంగా ఉందని చెప్పింది. తనకు సపోర్ట్‌గా నిలిచిన పేరెంట్స్‌కు థాంక్స్ చెప్పింది. ఇదిలో ఉండగా తనకు ఇష్టమైన వంటకం గురించి తెలిపిండి. అమ్మ చేసే పులస చేప కూర అంటే చాలా ఇష్టమని త్వరలోనే తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఆ వంటకాన్ని తింటానని స్పష్టం చేసింది సింధు.

Share post:

Popular