పుష్ప ఫస్ట్ సాంగ్ విడుదల తేదీ ఖరారు..!

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా చూపించబోతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం పుష్ప. ఈ సినిమాకు ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు ఆయన రచయిత కూడా. ఇక ముత్తం శెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అయిన నవీన్ ఎర్నేని అలాగే వై రవి శంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా, ఆయనకు జోడీగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమా క్రేజ్ ను పెంచడానికి బాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కు అత్యధిక రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఈ సినిమాలో విలన్ గా చూపించబోతున్నాడు మన సుకుమార్. అందుకే ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను రెండు భాగాలుగా విభజించి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు మూవీమేకర్స్ ప్రకటించారు.. ఇక ఈ సినిమా విషయానికొస్తే రెడ్ సాండర్స్ స్మగ్లింగ్ లో శేషాచలం కొండల్లో సినిమా షూటింగ్ జరుగుతోంది.ఇవి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో ఈ కొండలు ఉన్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను తెలుగు నుంచి హిందీ,మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో డబ్ చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా అప్డేట్స్ ఎప్పుడప్పుడు వస్తాయని ప్రేక్షకులలో ఎంతో ఉత్కంఠ నెలకొంది.ఆ ఉత్కంఠను ఇప్పుడు బ్రేక్ చేసి, ఈ సినిమా ఫస్ట్ సాంగ్ కు సంబంధించిన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. ఈ సంస్థ వారు తమ ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆగస్ట్ 13వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Share post:

Latest