పాయల్‌ రాజ్‌పుత్‌పై పోలీస్ కేసు..ఆ త‌ప్పుతో అడ్డంగా బుక్కైందిగా!

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఆర్ఎక్స్ 100` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ హాట్ బ్యూటీ.. మొద‌టి సినిమాలోనే ఓ రేంజ్‌లో అందాలు ఆర‌బోసి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీపై పోలీస్ కేసు న‌మోదు అయింది. ఇంత‌కీ పాయ‌ల్ ఏం త‌ప్పు చేసింది.. అస‌లు జ‌రిగిందో తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే.

Payal Rajput refutes rumours of doing a dance number in Kamal Haasan's  Indian 2 | Tamil Movie News - Times of India

పాయ‌ల్ పెద్దపల్లిలో వెంకటేశ్వర షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గత నెల 11న ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఆ సమయంలో పాయల్‌, షాపు యాజమాన్యం మాస్కులు ధరించకుండా, భౌతిక దూరంగా పాటించకుండా కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారని పెద్దపల్లికి చెందిన బొంకూరి సంతోష్‌ కోర్టులో ఫిర్యాదు చేశారు.

Payal Rajput denies speculations on a special song in Nagarjuna starrer  Bangarraju | Telugu Movie News - Times of India

జూనియర్‌ సివిల్‌ ఇన్‌చార్జి జడ్జి పార్థసారథి సిఫార్సు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేశ్‌ తెలిపారు. ప్ర‌స్తుతం విచార‌ణ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక షాప్ ఓపినింగ్ ఏమో కానీ ఈ ముద్దుగుమ్మ క‌రోనా నిబంధనలు ఉల్లంఘించి అడ్డంగా బుక్కైంది.

Share post:

Popular