కొడుకు చేసిన ఆ ప‌నికి షాక‌వుతున్న ప‌వ‌న్‌..నెట్టింట వీడియో వైర‌ల్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రేణూ దేశాయ్‌ల ముద్దుల కుమారుడు అకిరా నందన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మంచి ఎత్తు, చక్కటి ఫిజిక్, నూనుగు మీసాలతో చూడ‌మ‌చ్చ‌ట‌గా క‌నిపించే అకిరా నంద‌న్‌.. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌క‌ముందే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడు.

ఇక తాజాగా త‌న‌లోని ఓ కొత్త ట్యాలెంట్‌ను బ‌య‌ట‌కు తీసి అంద‌రినీ షాక్‌కు గురి చేశాడు కిరా. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్ త‌ర‌చుగా త‌న పిల్ల‌ల‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో అకిరా కర్రసాము చేసి అద‌ర‌గొట్టేశాడు. క‌ర్ర‌ని గింగ‌రాలు తిప్పుతూ క‌ళ్లు తిప్పుకోనీయ‌కుండా చేశాడు.

మొత్తానికి అకిరా ట్యాలెంట్‌ను చూసి అభిమానులే కాదు.. ప‌వ‌న్ కూడా షాక్ అయ్యార‌ని తెలుస్తోంది. కాగా, పూణేలో కరాటే, కుంగ్ ఫు వంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది టాప‌ర్‌ గా పేరు తెచ్చుకున్నాడు ప‌వ‌న్. ఇప్పుడు తండ్రి బాటలోనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అకిరా అంద‌రి చేత శ‌భాష్ అనిపించుకుంటున్నాడు.

Share post:

Latest