మ‌హేష్‌, ప్ర‌భాస్ కంటే ముందే వ‌స్తున్న‌ భీమ్లా నాయ‌క్?!

సంక్రాంతి 2022కి పెద్ద పెద్ద సినిమాలు విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ రాధేశ్యామ్ జనవరి 14న విడుదల కాబోతుండ‌గా, మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట జనవరి 13న రిలీజ్ కానుంది. అయితే వీరి కంటే ముందే వ‌స్తున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌వ‌న్‌, రానా ద‌గ్గుబాటి కాంబోలో తెర‌కెక్కుతున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `అయ్యప్పనుం కోషియం` రీమేక్.

సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ మ‌రియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్‌ భీమ్లా నాయక్‌ అనే పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తుండగా.. రానా అతడిని ఢీకొట్టే రిటైర్డ్‌ ఆర్మీ ఫీసర్‌ పాత్రలో క‌నిపించ‌నున్నాడు.

అయితే ఈ చిత్రం జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన వీడియో విడుద‌ల చేసిన చిత్ర యూనిట్‌.. రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించింది. అంటే సంక్రాంతికి అంద‌రికంటే ముందే ప‌వ‌న్ త‌న అభిమానుల‌ని ఎంటర్‌టైన్ చేయ‌నున్నాడు. కాగా, ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

Share post:

Popular