షారుక్ ఖాన్ సినిమాలో నయనతార …?

చాలా రోజుల నుంచి బాలీవుడ్ లో ఖాన్ ల సినిమాలు రావడం లేదు. అందులోనూ ముఖ్యంగా షారుక్ ఖాన్ సినిమాలు తెరపై కనిపించకపోవడంతో అభిమానులు అసహనంతో ఉన్నారు. తాజాగా ఆయన ఓ సినిమా చేయబోతున్నారు. టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ గా ఉన్న అట్లీతో ఆయన సినిమా చేయనున్నాడు. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలిసింది. షారుక్ ఖాన్ కు జంటకు స్టార్ హీరోయిన్ నయనతారను ఎంపిక చేశారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా లో సునీల్ గ్రోవర్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మాణం కానుంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో పటాన్ సినిమాను చేస్తున్నారు. అట్లీ ఈ సినిమాను చాలా ప్రెస్టేజియస్ గా తీసుకుని చేస్తున్నాడు. ఈ సినిమాపై మరిన్ని అప్ డేట్స్ త్వరలోనే తెలవనున్నాయి.

Share post:

Popular