ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై.. రామ్ చరణ్ ఏమని చెప్పారంటే ?

ఎన్టీఆర్ అభిమానులు..ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడు అని తెగ ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై …తను ఎప్పుడు ఎంట్రీ ఇస్తానో తనే స్వయంగా తెలియజేస్తానని అభిమానులకు ఒకానొక సమయంలో తెలియజేశాడు. ఇక అలా చెప్పడంతో తెలుగుదేశం నేతలు ఒక్కసారిగా చాలా ఇబ్బంది పడ్డారట. అయితే ఎన్టీఆర్ సహాయం కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అవసరమని మరికొంతమంది నేతలు అంగీకరించారు.

అయితే బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ ఎప్పుడు ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారనే వేచి చూస్తున్నాడు. కానీ ఎన్టీఆర్ మటుకు ఇప్పట్లోనే రానని, అప్పుడప్పుడూ చెబుతూ ఉంటాడు. ఇక తాజాగా ఈ విషయం పై మరొక ప్రశ్న ఎదురైంది ఎన్టీఆర్ కు. RRR లో నటిస్తున్న రామ్ చరణ్ నుండి ఈ ప్రశ్న రావడం చాలా గమనార్హం గా ఉంది.

ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చి రూ.25 లక్షలు గెలుచుకున్నాడు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ డబ్బులను ఏదైనా ఫౌండేషన్ కి డొనేట్ చేస్తా అని కూడా రామ్ చరణ్ తెలియజేశాడు. ఇదే ఈ సమయంలో రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ ను”నువ్వు కూడా రాజకీయాల్లోకి వెళ్తావు అంటగా.. ?” అని ప్రశ్నించగా ఎన్టీఆర్ అయితే కొంత సేపు సమయం తీసుకుని రామ్ చరణ్ తో డిస్కషన్ చేశాడని తెలుస్తోంది.

అలా డిస్కషన్ చేయడంలో కొన్ని విషయాలను రామ్ చరణ్ కి చెప్పాడు అన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని టీవీ నిర్వాహకులు ప్రసారం చేస్తారా..? లేదా..? అనే విషయంలో సందేహం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. ఏది ఏమైనా ఎన్టీఆర్ రాజకీయాల్లో రావడానికి ఒక క్లారిటీ మీద ఉన్నట్లు తెలుస్తోంది.

Share post:

Latest