అప్పట్లో ఒక‌డు అలా చేశాడు..గుట్టంతా బ‌య‌ట‌పెట్టిన నివేదా పేతురాజ్!

నివేదా పేతురాజ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `మెంటల్ మదిలో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో వంటి చిత్రాల‌తో మంచి గుర్తింపును ద‌క్కించుకుంది. మ‌రోవైపు త‌మిళంలోనూ ప‌లు చిత్రాలు చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.

ఇక తెలుగులో ఈ మధ్యే పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నివేదా.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని వృత్తిప‌ర‌మైన మ‌రియు వ్య‌క్తిగ‌త‌ప‌ర‌మైన విష‌యాలెన్నో పంచుకుంది. ఈ క్ర‌మంలోనే త‌న ఫస్ట్ లవ్ ప్రపోజల్ కు సంబంధించిన గుట్టంతా బ‌య‌ట పెట్టింది. కాలేజ్ డేస్ లో ఒక అబ్బాయి తనను ఇష్టపడ్డాడ‌ని నివేదా చెబుతూ..`ల‌వ‌ర్స్ డే నాడు ఒక అబ్బాయి వచ్చి పూల బొకే ఇచ్చి నీ కోసం బయట ఒకరు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు.

దాంతో ఎవ‌రా అని వెళ్లి చూస్తే అక్కడ నిజంగా ఒక అబ్బాయి ఉన్నాడు. అతని దగ్గరకు వెళ్లి విష‌యం ఏంట‌ని అడిగితే.. ఒక సంవ‌త్స‌రం నండీ పాలో అవుతున్నానని.. నిన్ను ల‌వ్ చేస్తున్నాని చెప్పేశాడు. ఆ తర్వాత లవ్ లెటర్ కూడా అవ్వ‌బోయాడు. కానీ, అంతలోనే నేను నో చెప్పేశా. కానీ.. అతడిచ్చిన పూల బొకే అందంగా ఉండ‌టంతో అది మాత్రం తీసుకున్నా. ఆ త‌ర్వాత స‌ద‌రు అబ్బాయి ఎప్పుడూ క‌నిపించ‌లేదు.` అంటూ చెప్పుకొచ్చింది.

Share post:

Latest