‘పంచమి’గా అవతారమెత్తిన ఇస్మార్ట్ బ్యూటీ

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు కూడా ఒకటి. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను రాబిన్‌హుడ్ తరహా చిత్రంగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా నుండి సడెన్ సర్‌ప్రైజ్‌గా ఓ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆమె ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొనగా, నేడు ఆమె పుట్టినరోజు కానుకగా ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ ‘పంచమి’ అనే పాత్రలో నటింబోతుంది. ఆమె నృత్యం చేస్తూ కనిపించే పోస్టర్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేశారు. ఈ సినిమాలో అమ్మడి పాత్ర ఆమె కెరీర్‌కు బాగా బూస్ట్ ఇచ్చే విధంగా ఉండబోతున్నట్లు ఈ పోస్టర్ చూస్తే తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్ కూడా మరో హీరోయిన్‌గా నటిస్తోండగా, బ్రటిష్ కాలం నాటి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంతమేర జరుపుకోగా, ప్రస్తుతం మిగతా భాగానికి సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.