తారక్ న్యూ లుక్ వైరల్..!

కొద్ది రోజుల క్రితం షూటింగ్ నిమిత్తం ఆర్ఆర్ఆర్ చిత్రబృందంతో సహా రామ్ చరణ్, తారక్ ఉక్రెయిన్ దేశానికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తన పాత్రకు సంబంధించి చిత్రీకరణ పూర్తి కావడంతో తారక్ తిరిగి స్వదేశానికి వచ్చారు. తాజాగా జూ.ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. వైట్ టీ షర్ట్, జీన్స్ ప్యాంటు, బ్లాక్ రంగు మాస్కు, క్యాప్ ధరించి ఆయన చాలా క్యాజువల్ గా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆగష్టు 1న ఉక్రెయిన్ దేశానికి వెళ్ళిన రాజమౌళి బృందం అక్కడ ఒక సాంగ్ షూట్ చేశారని సమాచారం. ఇటీవల తారక్ చెర్రీతో కలిసి షూటింగ్ లొకేషన్ కి వెళుతున్న ఒక వీడియోని అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఆర్ఆర్ఆర్ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. కాగా దీనిపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Share post:

Latest