మళ్లీ అడ్డంగా బుక్కైన త‌మ‌న్‌..ఆడుకుంటున్న నెటిజ‌న్స్?!

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న సంగీతం అందిస్తున్న చిత్రాల్లో ప‌వ‌న్ క‌ళ్యాన్‌-రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ `భీమ్లా నాయక్` ఒక‌టి. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఇక నేడు స్వాతంత్ర్య‌ దినోత్స‌వం సంద‌ర్భంగా భీమ్లా నాయక్ నుంచి ఫ‌స్ట్ గ్లింప్స్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ గ్లింప్స్‌లో ప‌వ‌న్ లుక్స్‌, డైలాగ్స్ ఆక‌ట్టుకున్నాయి. అలాగే విజువ‌ల్స్‌తో పాటు త‌మ‌న్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్‌గా నిలిచాయి. అయితే ఈ గ్లింప్స్ ను అలా వ‌దిలారో లేరో.. ఇందులోని మ్యూజిక్‌ని కూడా థమన్ కాపీ చేశాడంటూ కొంద‌రు నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు చేయ‌డం స్టార్ట్ చేశారు.

ఈ గ్లింప్స్‌లో ఓ బిట్‌లో త‌మన్ అందించిన మ్యూజిక్‌.. పెట్టా సినిమాలోని ఓ పాటలోని మ్యూజిక్‌తో పోలి ఉంది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే త‌మ‌న్‌పై ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తూ ఆడుకుంటున్నారు. కాగా, గ‌తంలో త‌మ‌న్‌పై ఇలాంటి కాపీ మ‌ర‌క‌లు ఎన్నో సార్లు వ‌చ్చాయి. ఇక భీమ్లా నాయ‌క్ గ్లింప్స్‌తో మ‌రోసారి అడ్డంగా బుక్కైన ఈయ‌న వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారాడు.

Share post:

Latest