అర‌రే..రాధికా ఆప్టేకు ఎంత క‌ష్ట‌మొచ్చింది..ఆడుకుంటున్న నెటిజ‌న్లు!

రాధికా ఆప్టే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినిమాల‌కంటే.. వివాదాలు, వివాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తోనే ఫుల్ పాపుల‌ర్ అయింది ఈ హాట్ బ్యూటీ. ప్ర‌స్తుతం బాలీవుడ్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ భామ‌కు.. ఓ అనుకోని క‌ష్ట‌మొచ్చి పడింది. ఉన్నట్టుండి ఈ రాధికాపై నెటిజన్లు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు, ‘బైకాట్‌ రాధికా ఆప్టే’ అనే హాష్‌ ట్యాగ్‌ను ట్విట్టర్ లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇంత హాఠాత్తుగా రాధిక‌తో నెటిజ‌న్లు ఆడుకోవ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా.. రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు. నటీమణులతో బలవంతంగా అశ్లిల వీడియోల చిత్రీక‌రించడ‌మే కాకుండా.. వాటిని కొన్ని యాప్ ల ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నార‌ని..ఈ పోర్న్ మాఫియాకు రాజ్ కుంద్రానే ప్రధాన సూత్రధారి అని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.

అయితే ఈ కేసుకు, రాధిక‌కు సంబంధం లేక‌పోయినా.. ఆమె అడ్డంగా ఇరుక్కుంది. గతంలో మీట‌ ఉద్యమ సమయంలో బహిరంగంగా మాట్లాడిన రాధికా ఆప్టే లాంటి నటీమణులు రాజ్‌ కుంద్రా కేసు విషయంలో మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే రాధికతో పాటు..మరికొందరు తారలపై సైతం నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇక అలా తెర‌పైకి వ‌చ్చిన హాష్ ట్యాగే బైకాట్‌ రాధికా ఆప్టే. మ‌రి దీనిపై రాధికా ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Share post:

Latest