సురేఖ వాణి ఎందుకిలా చేసింది..? అస‌హ‌నంలో నెటిజ‌న్లు!

సురేఖ వాణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సురేఖ వాణి.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో హీటెక్కిస్తూ ఉంటుంది. అలాగే కూతురు సుప్రిత‌తో క‌లిసి త‌ర‌చూ పార్టీలు చేసుకోవ‌డం, టూర్లకు వెళ్ల‌డం చేస్తూ లైఫ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తుంటుంది సురేఖ‌.

ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా సురేఖ వాణి త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోయే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో అడుగు పెట్ట‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ విష‌యంపై స్పందించిన సురేఖ‌.. `తాను బిగ్‌బాస్‌ షోకి వెళ్లడం లేదని, దయ చేసి ఇలాంటి రూమర్స్‌ని ఎంకరేజ్ చేయకండి` అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.

కానీ, ట్విస్ట్ ఏంటంటే.. సురేఖ తాను పోస్ట్ చేసిన స్టోరీని కొద్ది సేప‌టికే డిలీట్ చేసింది. దాంతో అయోమ‌యంలో ప‌డిన నెటిజ‌న్లు.. సురేఖ వాణి ఎందుకిలా చేసింది..? పోస్ట్ పెట్టిన‌ట్టే పెట్టి ఎందుకు డిలీట్ చేసింది..? అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక సురేఖ వాణి తీరుతో.. బిగ్‌బాస్‌లోకి ఆమె ఎంట్రీ ఉంటుందా ఉండదా అనేది మరోసారి ప్రశ్నార్థకంగానే మారింది.