ఆ ప‌ని ఎప్ప‌టికీ చేయ‌ను..పెళ్లిపై న‌య‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు!

లేడీ సూప‌ర్ న‌య‌నతార, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివన్ ఎప్ప‌టి నుంచో ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా విహార యాత్ర‌ల‌కు చెక్కేసే ఈ లవ్‌బర్డ్స్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ, న‌య‌న్‌-విఘ్నేష్‌లు మాత్రం పెళ్లిని లేట్ చేస్తూనే వ‌స్తున్నారు.

Nayanthara-Vignesh Shivan to tie knot at a temple? | Nayanthara wedding

అయితే తాజాగా ఓ ఇంట‌ర్య్యూలో పాల్గొన్న న‌య‌న్‌.. పెళ్లిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఇప్ప‌టికే కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో విఘ్నేష్‌తో త‌న నిశ్చితార్థం జ‌రిగింద‌ని చెప్పుకొచ్చిన న‌య‌న్‌..మా వివాహ తేదీ ఇంకా ఖరారు కాలేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇక ముహూర్తం ఫిక్స్‌ అయిన వెంటనే నా ఫ్యాన్స్‌కి చెబుతాను. కానీ, రహస్యంగా మాత్రం ఎప్ప‌టికీ పెళ్లి చేసుకోను అని తెలిపింది.

Vignesh Shivan, Nayanthara return from Goa on chartered flight - Tamil Nadu  News, Chennai News, Tamil Cinema News, Tamil News, Tamil Movie News, Power  Shutdown in Chennai, Petrol and Diesel Rate in

వృత్తిపరంగా మా గోల్స్‌ను సాధించే పనిలో మేం బిజీగా ఉండటం వల్లే ఇప్పటివరకు పెళ్లి గురించి సరైన నిర్ణయం తీసుకోలేద‌ని న‌య‌న్ పేర్కొంది. అలాగే విఘ్నేష్‌ నా బాయ్‌ఫ్రెండ్‌ స్టేజ్‌ దాటి పోయాడు. ఆయన నాకు కాబోయే భర్త. ఇక‌పై మీడియా కూడా వారి కథనాల్లో ఇలాగే రాస్తారని ఆశిస్తున్నాను అంటూ న‌య‌న్ తెలిపింది. దాంతో ఈమె వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.