వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. చిత్తూరులో నవరత్నాల ఆలయం..?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు రూపొందించిన నవరత్నాలు పథకాలు అధికారంలోకి చేపట్టిన తరువాత అమలు చేస్తూ వస్తున్నారు. నవర్నతాల ద్వారా కోట్లాది మంది లబ్ధిపొందుతున్నారు. ఈ గొప్పదనాన్ని ప్రజలకు వివరించేందుకు ..జగనన్న మది దోచేందుకు ఓ ఎమ్మెల్యే ఏకంగా మ్యూజియం కమ్ ఆలయాన్నే నిర్మించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మదిలో దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఈ ఆలయాన్ని రూపొందించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు సచిత్రంగా వివరించారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా రూపొందించిన తొమ్మది పిల్లర్లు ఉంటాయి. ఒక్కో పిల్లర్ ఒక్కో సంక్షేమ పథకాన్ని తెలిపేలా రూపొందించారు. సాధారణంగా అధికార పార్టీలో నాయకులు తమ నాయకుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. మధుసూదన్ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచించి నవరత్నాల ఆలయాన్ని కట్టించారు. తిరుపతి సమీపంలో ఈ కళాఖండాన్ని నిర్మించారు. మ్యూజియంలో నిర్మించిన అద్దాల మేడ చూపరులను ఆకట్టుకునేలా అద్బుతంగా రూపొందించారు. వైసీపీ ప్రభుత్వంలో రూపొందించిన పథకాలు తెలుసుకోవాలంటే ఈ మ్యూజియాన్ని చూస్తే తెలుస్తుంది. కర్ణాటక, తమిళనాడునుంచి నిపుణులను రప్పించి అద్దాలమండపాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇటీవల కాలంలో ఇటువంటి ఎవరికీ రాలేదు.. అరె.. మధు సూదన్ రెడ్డికి భలే ఐడియా వచ్చిందే అని పలువరు ఎమ్మెల్యేలు మెచ్చుకోవడంతోపాటు.. మధుకు అధినేత మంచి గిఫ్ట్ కూడా ఇస్తారని చర్చించుకుంటున్నారట.

Share post:

Latest