మొదటిసారి సినీ ఇండస్ట్రీలో ఐడి కార్డ్స్…

ఇప్పటివరకు మనం కేవలం కాలేజీల్లోనూ, ఉద్యోగ సంస్థలలోనూ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలలో అలాగే ప్రైవేట్ రంగాలలో మాత్రమే చేరినప్పుడు మనకంటూ ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా కనీ వినీ ఎరుగని రీతిలో సినీ ఇండస్ట్రీలో కూడా ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతోంది. ఇదేంటి..? సినీ ఇండస్ట్రీలో కూడా ఐడి కార్డుల.. ఇదెక్కడి విడ్డూరం..? అని మీరు కూడా ఆశ్చర్యపోతున్నారా.. ?నిజమేనండి..! ఒక దర్శకుడి ఆలోచన కార్యరూపం దాల్చుకుంది.. ఇంతకు ఈ ఐడి కార్డులు గోలేంటో పూర్తిగా తెలుసుకుందాం..

దర్శకధీరుడు రాజమౌళి స్టార్ హీరోలు గా గుర్తింపు పొందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో కలసి మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ మూవీ ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ తన ఫేస్ బుక్ ద్వారా సరికొత్తగా ఐడి కార్డును మెడలో వేసుకొని ఉండగా, రాజమౌళి తన ఐడి కార్డ్ ను చేతిలో పట్టుకొని చూపిస్తూ, ఒక ఫోటోను షేర్ చేయడం జరిగింది. ఇది కాస్తా వైరల్గా మారింది.

ఇక ఎన్టీఆర్ ఈ ఫోటోను షేర్ చేస్తూ.. “మొట్ట మొదటిసారి నేను సెట్ మీద ఐడి కార్డు ను వేసుకోవడం జరిగింది..” అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఏదిఏమైనా మొట్టమొదటిసారి సినిమా సెట్లో ఐడి కార్లతో సంచలనంగా సరికొత్త రికార్డును సృష్టించారు ఆర్ఆర్ఆర్ సినిమా సభ్యులు.

Share post:

Latest