మిల్కి బ్యూటీ మరో సాహసం..?

మిల్కీ బ్యూటీ తమన్నా అంటే చాలా మందికి ఇష్టం. ఆమె స్టైల్, గ్లామర్ కు కుర్రకారు ఫిదా అయిపోతారంతే. టాలీవుడ్ లో రెండు తరాల హీరోలతో ఈ మిల్కీ బ్యూటీ నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో తమన్నా కొన్ని వెస్ సీరిస్ లను చేయాలని అనుకుంటోంది. లాక్ డౌన్ టైంలో చాలా మంది ఓటీటీలపై పడ్డారు. చాలా పెద్ద సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. కొన్ని వెబ్ సీరిస్ లు కూడా బాగా పాపులర్ అయ్యాయి.

- Advertisement -

దీంతో తమన్నా కూడా వెబ్ సీరిస్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంది. ఓ విలక్షణమైన క్యారక్టర్ చేసి అందర్నీ మెప్పించాలని చూస్తోంది. సినిమాలల్లో బిజీగా ఉంటూనే ఐటెమ్ సాంగ్స్ చేస్తూ కాసులు మూటగట్టుకుంటోంది. మరోవైపు ఈ అమ్మడు టీవీ షోకి హోస్ట్ గా కూడా చేస్తోంది. మిల్కీ బ్యూటీ ఇప్పటికే రెండు వెబ్ సిరీస్ లను చేసేసింది. ఓ వైపు సినిమాలు, మరో వైపు వెబ్ సీరిస్ లను చేస్తూ తమన్నా బిజీ బిజీగా గడుపుతోంది.

Share post:

Popular