మెగాస్టార్ కి శుభాకాంక్షలు చెప్పిన బాబు, లోకేష్..!

నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ రోజు ఆయన 61వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. చిన్నతనం నుంచి కష్టపడి అనేక విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమైనది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయినప్పటికీ మెగాస్టార్ వారితో పోటీపడి సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ తనదైన పాత్ర పోషిస్తున్నారు. కరోనా టైంలో వివిధ సేవా కార్యక్రమాలు చేసి అందరి అభిమానాన్ని చూరగొన్నారు.

- Advertisement -

నిరాశ్రయులకు అండగా నిలిచారు. ప్రస్తుతం ఆయనకు జన్మదినం సందర్భంగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ఇద్దరూ కూడా మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రస్తుతం ఆయన నటించనున్న 154 సినిమా భోళా శంక‌ర్ పోస్ట‌ర్ కూడా విడుదలై అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.

Share post:

Popular