మెగా ఫ్యామిలీకి లక్కీ లేడీ గా మారిన అనుసూయ..?

ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో పెద్ద హీరోలతో చిన్న చిన్న ఛాన్స్ లను కొట్టేసింది. ఈమె ఛాన్సులను కొట్టేయడమే కాకుండా జబర్దస్త్ యాంకర్ గా రాణిస్తోంది.ఈమె రామ్ చరణ్ సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ లో బాగా నటించి, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇకపోతే బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూనే , వెండితెరపై కూడా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు కొట్టేస్తూ, మంచి రేంజ్ కు ఎదుగుతోంది అని చెప్పవచ్చు.

ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప మూవీలో అనసూయ ఒక పాత్రను పోషిస్తోంది. అంతేకాదు చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీకి కూడా సంతకం చేసిందట. తాజాగా ఈమె గురించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్రను పోషిస్తోంది.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో నటించటానికి ఉర్రూతలూగుతోంది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు కూడా తెలుపుతున్నారు. మలయాళ చిత్రం లూసిఫర్ కి రీమిక్స్ గాడ్ ఫాదర్ ..ఈ సినిమాకి కంటిన్యూగా షూటింగ్ కొద్దిరోజుల్లో జరగనుంది. దీనికి సంగీతం అందిస్తున్న వారు థమన్. ఈ సినిమాలో కీలకపాత్రను సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు.

అనసూయ కెరీర్ ప్లేస్ లో బెస్ట్ పొజిషన్లో ఉంది. వైవిధ్య, విలక్షణత ఉన్న పాత్రలను పోషిస్తోంది. ఇప్పటికిప్పుడే అరడజను పైగా సినిమా ఛాన్స్ లు వచ్చాయి. ఒకవైపు రవితేజ ఖిలాడీలో ,మరోవైపు కృష్ణవంశీ రూపొందిస్తున్న రంగమార్తాండ చిత్రంలో బహు కీలకపాత్రలో నటించబోతోంది. ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటించబోతోంది. ఒకవైపు బుల్లితెర పైన మరోవైపు వెండితెర పైన ఈ అమ్మడు రాకెట్ లాగ దూసుకుపోతోంది.

ప్రస్తుతం రంగమార్తాండ , ఖిలాడీ సినిమాలకు 30 లక్షలు పారదర్శకం అందుకున్నారని బయట గుసగుసలు వినిపిస్తున్నాయి

Share post:

Latest