ఈసారి మ‌హేష్ బ‌ర్త్‌డే వేడుక‌లు ఎక్క‌డ జ‌ర‌గ‌బోతున్నాయో తెలుసా?

ఆగస్ట్ 9న టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బ‌ర్త్‌డే అన్న సంగ‌తి తెలిసిందే. ప్రతి ఏడాది మహేష్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు రక్తదానాలు, పాలాభిషేకాలు, పెద్ద పెద్ద కటౌట్ లనూ ఏర్పాటు చేసి కేకులను కట్ చేస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం మ‌హేష్.. అభిమానులకు తన పుట్టినరోజున మొక్కలను నాటాలని అభ్యర్థించాడు.

దాంతో అభిమానులు మొక్క‌లు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సారి మ‌హేష్ బ‌ర్త్‌డే వేడుక‌లు గోవాలో జ‌ర‌గ‌నున్నాయ‌ని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

అయితే గోవాలో ఓ షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు. అదీ పుట్టినరోజుకు ముందే. దాంతో మహేష్‌ గోవా వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఇక‌ ఆయన వెళ్లిన ఓ రోజు తర్వాత నమ్రత, పిల్లలు గౌతమ్‌, సితార వెళతారని.. గోవాలోనే ఫ్యామిలీ మ‌రియు సర్కారు వారి పాట చిత్రబృందం సమక్షంలో మ‌హేష్ బ‌ర్త్‌డే జ‌రుపుకోనున్నార‌ని తెలుస్తోంది.

Share post:

Popular