హీరో సూర్య‌కు ఎదురుదెబ్బ‌..హైకోర్టు చివాట్లు?!

త‌మిళ స్టార్ హీరో సూర్య‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. మద్రాస్ హైకోర్టు ఆయ‌న‌కు చివాట్లు పెట్టింది. అస‌లు ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..2007-2009 ఆర్ధిక సంవత్సరాలకు గాను ఆదాయపు పన్ను వడ్డీ మినహాయింపు కోరుతూ 2018లో సూర్య పిటిషన్‌ను వేయ‌గా.. మద్రాస్ హైకోర్టు తాజాగా దానిని కొట్టిపారేసింది.

హైకోర్టు సూర్యకు వడ్డీతో సహా ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన మొత్తాన్ని చెల్లించాల్సిందేనని తీర్పు ఇచ్చింది. అలాగే సెలబ్రిటీగా ఉన్నత స్థానంలో ఉన్న మీలాంటి వ్యక్తులు ఇలా పిటీస‌న్‌లు వేయ‌డం స‌రికాద‌ని చివాట్లు పెట్టింది. కాగా, 2010లో ఆదాయపు పన్ను విభాగం సూర్య ఇంటిపై దాడి చేసింది. ఇందులో లెక్కల్లో లేని పలు ఆదాయాలకు సంబంధించి మొత్తం రూ. 3.11 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు.

దాంతో సూర్య ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో ఇన‌టాక్స్ అధికారులు తనకు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేయ‌గా.. మూడేళ్ల‌కు ఇన్‌టాక్స్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన మొత్తాన్ని చెల్లించాల్సిందేనని తీర్పును ఇచ్చింది. ఈ క్ర‌మంలోనూ సూర్య మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయ‌గా.. ఇప్పుడు ఇక్క‌డా ఈయ‌న‌కు షాకే త‌గిలింది.