లవ్ స్టోరి ప్రచారంలో పొరపాటు.. ఆడుకున్న నెటిజెన్స్

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి నటిస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరి గతంలోనే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా రిలీజ్‌పై చిత్ర యూనిట్ తాజాగా ఓ క్లారిటీ ఇచ్చింది.

ఈ సినిమాను సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. వినాయక చవితి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ ప్రకటన పోస్టర్‌లో వినాయక చవితి అనే పదాన్ని ఇంగ్లీష్‌లో తొలుత వినాకయ అనే స్పెల్లింగ్‌తో ప్రచురించారు. దీంతో నెటిజన్లు ఈ పోస్టర్‌ను ఒకటే ట్రోలింగ్ చేశారు. వెంటనే తేరుకున్న చిత్ర యూనిట్ ఆ పోస్టర్‌లోని మిస్టేక్‌ను సరిదిద్దుకుంది. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.

ఇక ఈ సినిమాలో చైతూ, సాయి పల్లవిల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. కాగా ఈ సినిమాను ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే వినాయక చవితి వరకు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Popular