బిగ్‌బాస్ 5: కంప్లీటైన ఏవీ షూట్.. రేపటి నుంచీ..?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే సీజ‌న్ 5 కూడా స్టార్ట్ కాబోతోంది. ఈ సీజ‌న్‌కు కూడా కింగ్ నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ప్రోమో కూడా విడుదలై.. విశేషంగా ఆక‌ట్టుకుంది.

- Advertisement -

Bigg Boss Telugu Season 5 promo out. Watch video - Television News

సెప్టెంబర్ 5 నుంచి సీజన్ 5 షురూ కానుంది. ఇందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు నిర్వాహ‌కులు. అయితే బిగ్‌బాస్ 5కు సంబంధించిన ఓ న్యూ అప్డేట్ బ‌య‌ట‌కు వచ్చింది. దాని ప్ర‌కారం..కంటెస్టెంట్ల ఏవీ షూట్ తాజాగా కంప్లీట్ అయింద‌ట‌. ఇక రేప‌టి నుంచీ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లకు క్వారంటైన్ విధించనున్నార‌ట‌.

Bigg Boss Contestants : బిగ్‌బాస్ సీజ‌న్‌ 5 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్? | Bigg  Boss Season 5 Telugu Contestants List?

ఆగష్టు 26 నుండి సెప్టెంబర్ 3 వరకు కంటెస్టెంట్లను హైదరాబాద్ నగరంలో ఐటీసీకి చెందిన ఫైవ్ స్టార్ హోటల్లో క్వారంటైన్ కి పంపనున్నారని.. నాలుగో తేదీనే తొలి ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుంద‌ని తెలుస్తోంది. ఆ ఎపిసోడ్‌ను సెప్టెంబ‌ర్ 5న ప్ర‌సారం చేయ‌నున్నారు. ఇక కంటెస్టెంట్ల విష‌యానికి వ‌స్తే..యాంకర్ రవి, నటి ప్రియా, ట్రాన్స్‏జెండర్ ప్రియాంక, యాంకర్ వర్షిణి, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్యం అలియాస్ ఉమ, నటి లహరి, నవ్వస్వామి, యూట్యూబర్ నిఖిల్, వీజే సన్నీ, లోబో, సిరి హన్మంత్, ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ త‌దిత‌రుల పేర్లు ప్ర‌చారంలో ఉన్నాయి.

Share post:

Popular