లక్ష్మీపార్వతి నోట ధర్మాన మాట..ఆ విషయం తెలిసే ఉంటుందేమో..?

ఏపీ తెలుగు- సంస్కృత అకాడెమీ అధ్యక్షురాలు లక్ష్మిపార్వతి దాదాపుగా రాజకీయాలు మాట్లాడరు. సభలు, సమావేశాల్లో కూడా ఆమె విద్యా విషయాలపైనే ఎక్కువ మాట్లాడతారు. అయితే ఇటీవల ఆమె చేసిన కామెంట్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. త్వరలో జరుగబోయే మంత్రి వర్గ విస్తరణలో ధర్మాన ప్రసాదరావుకు మంత్రి వర్గం ఖాయమని చెప్పింది. ఇదే వేదికపై ధర్మాన కూడా ఉన్నారు. శ్రీకాకుళంలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆమె ఈ కామెంట్ చేశారు.  రెండున్నర సంవత్సరాల తరువాత మంత్రి వర్గంలో మార్పులుంటాయని ఏపీ సీఎం గతంలోనే చెప్పారు. అందులో భాగంగానే ఈసారి ప్రసాదరావుకు చాన్స్ వస్తుందని.. ప్రస్తుత మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ కు ఉద్వాసన పలకవచ్చనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. జగన్ కోటరీ నుంచి ఆమెకు ఎంతో కొంత సమాచారం వచ్చి ఉంటుందని లేకపోతే ఇంత కామెంట్ ఎలా చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -

ఇదిలా ఉండగా ధర్మాన క్రిష్ణదాస్ జగన్ కు చాలా దగ్గరగా ఉంటారు.. అంత క్లోజ్ గా ఉన్న ప్రసాదరావును ఎలా తొలగిస్తారనే ప్రశ్నలు కూడా  ఉత్పన్నమవుతున్నాయి.  అయితే పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అసంత్రుప్తిగా ఉన్నారని, జగన్ కానీ, పార్టీ పెద్దలు గానీ పెద్దగా పట్టించుకోలేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు. అంత పెద్ద సీనియర్ నాయకుడు పార్టీలో ముభావంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఎదురుగాలి వీచే ప్రమాదముందని.. అందుకే సంత్రుప్తి పరచేందుకు ప్రసాదరావుకు క్యాబినెట్  బెర్త్ దక్కే చాన్స్ ఉందని తెలుస్తోంది. ఏదేమైనా నిప్పు లేందే  పొగ రాదు.. లక్ష్మీపార్వతికి కామెంట్స్ నిజమే అయితే ధర్మాన ప్రసాదరావు జాక్ పాట్ కొట్టినట్టే..

Share post:

Popular