ఆ డైరెక్ట‌ర్ అంటే భ‌య‌మంటున్న కియారా..కానీ..?

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ భామ‌.. ఆ త‌ర్వాత బాలీవుడ్‌కే ప‌రిమితం అయిపోయింది. అక్క‌డ వ‌రుస సినిమాలు చేస్తూ.. బిజీ హీరోయిన్‌గా మారింది. అయితే లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు వారిని ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మైంది.

Kiara Advani to star opposite Ram Charan in Shankar's next film |  Celebrities News – India TV

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఇండియ‌న్ టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రంలో కియారా హీరోయిన్‌గా ఫిక్స్ అయింది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ కూడా అధికారికంగా ప్ర‌క‌టించింది. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కియారా.. చ‌ర‌ణ్‌-శంక‌ర్ ల మూవీపై ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేసింది.

Kiara Advani to star opposite Ram Charan in director Shankar's next film |  The News Minute

`సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు చేయాలని తనకు ఎన్నో మెసేజ్‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. సరైన స్క్రిప్ట్‌ కోసం వెయిట్ చేస్తూ వ‌చ్చాను. అలాంటి త‌రుణంలో చ‌ర‌ణ్ మూవీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింది. వెంట‌నే ఓకే చెప్పా. అయితే ఎందుకో తెలియ‌దు శంక‌ర్ అంటే కాస్త భ‌యం. కానీ, ఆయ‌న‌తో ప‌ని చేయ‌డం చాలా ఇష్టం. ఆయ ఎంతో అద్భుతమైన దర్శకుడు. అటువంటి ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌డానికి చాలా ఆస‌క్తిగా ఉన్నాను` అంటూ కియారా చెప్పుకొచ్చింది.

Share post:

Popular