కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్.. అసలు సంగతేంటంటే?

ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆయన కత్రినాకైఫ్ అలాగే విక్కీ కౌశల్ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. గతకొద్ది కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ ప్రేమజంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటూ బీటౌన్ మీడియా మొత్తం కోడై కూస్తోంది. అయితే ఇటీవల జరిగిన రోకా ఫంక్షన్ లో ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. దీంతో పలువురు నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే మరొక వైపు ఫీలింగ్ సారి ఫర్ సల్మాన్ ఖాన్ అంటూ మరికొందరు నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన కత్రీనా ఆ వార్తల్లో నిజం లేదు అని తెలిపింది. అలాగే కత్రినాకైఫ్ అతి త్వరలోనే టైగర్ 3 షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తున్నారని తెలిపింది. ఇక వీరిద్దరూ గత రెండేళ్లుగా డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి పార్టీలకు మాల్దీవులకు వెళ్లడం, అలాగే ప్రైవేట్ పార్టీలు, వేడుకలలో పాల్గొనడంతో ఈ రూమర్స్ కు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది . అంతేకాకుండా ఒక షోలో సోనమ్ కపూర్ సోదరుడు నటుడు హర్షవర్ధన్ కపూర్ కూడా కత్రినా,విక్కీ రిలేషన్ లో ఉన్నారంటూ బాంబు పేల్చాడు.