తలైవి సినిమా విడుదల తేదీ ఫిక్స్..ఎప్పుడంటే?

తలైవి కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వస్తున్న సినిమా మొత్తానికి విడుదల తేదీ ఖరారు చేసుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మూడు సినిమాలలో రిలీజ్ అవుతున్నట్లు చిత్ర నిర్మాతలు అయినా విష్ణువర్ధన్, అలాగే శైలేజ్ ఆర్ సింగ్ తెలిపారు. ఈ సినిమాలో జయలలిత పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించగా, ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటించారు. ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ సంగీతాన్ని అందించారు. అయితే ఈ సినిమా గత ఏడాది జూన్ 26వ తేదీవిడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడింది.

ఆ తరువాత ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీన విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాతలు భావించినప్పటికీ, కరోనా సెకండ్ దేవత అది కూడా జరగలేదు. అయితే కరోనా మహమ్మారి తగ్గడంతో నిదానంగా థియేటర్లు తెరుచుకోవడం మొదలుపెట్టాయి. అంతేకాకుండా తమిళనాడులో 50 శాతం థియేటర్లను నడపడానికి ప్రభుత్వ అనుమతి ఇవ్వడంతో, అలాగే సినిమాను సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఆ చిత్రం యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. తమిళం తెలుగు వర్షన్ ట్యాగ్లైన్ పెట్టక పోగా హిందీ వర్షన్ కి మాత్రం జయాస్ జర్నీ సినిమా సే సిఎం తక్ అని పెట్టారు. కరోనా సెకండ్ వేవ్ తరువాత పాన్ ఇండియా మూవీ గా తలైవి ఫస్ట్ మూవీ గా రావడం విశేషం.