భ‌ర్త కోసం కాజ‌ల్ కీల‌క నిర్ణ‌యం..మ‌ళ్లీ అలా..?

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి కొత్తగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇక గ‌త ఏడాది ప్రియుడు, ముంబైలో స్థిర‌ప‌డిన వ్యాపార‌వేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుని.. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది కాజ‌ల్‌.

Kajal Aggarwal-Gautam Kitchlu love story: We dated for three years, then were friends for seven | Celebrities News – India TV

పెళ్లి త‌ర్వాత పెద్దగా పర్సనల్‌ లైఫ్‌కు టైమ్‌ కేటాయించకుండానే ఆచార్య సెట్స్‌లో జాయిన్ అయిపోయింది. ఆ తర్వాత భర్త గౌతమ్‌తో కలిసి కాజల్‌ ఓ స్మాల్‌ వెకేషన్‌కు వెళ్లారు. ఆ వెంట‌నే మళ్లీ సినిమాల‌తో బిజీ బిజీ అయింది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా భ‌ర్త కోసం కాజ‌ల్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

Kajal Aggarwal Opens Up About 'Emotional Proposal' by Gautam Kitchlu, Says 'It Was Heartfelt Conversation' | India.com

సినిమాల నుంచి కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకుని.. భ‌ర్త‌తో టైమ్ స్పెండ్ చేయాల‌ని కాజ‌ల్ భావింస్తోంద‌ట‌. ఎలాగో ప్ర‌స్తుతం తాను న‌టిస్తున్న హే సినామిక, కరుంగాపియమ్, ఘోస్టీ చిత్రాలు పూర్తి అయ్యాయి. అందుకే చిన్న బ్రేక్ తీసుకుని గౌత‌మ్‌తో మ‌ళ్లీ వెకేష‌న్‌కు వెళ్లాల‌ని కాజ‌ల్ ప్లాన్ చేస్తోంద‌ట‌. వెకేష‌న్ అనంత‌రం ఆచార్య, నాగార్జున మూవీ షూటింగ్స్‌లో జాయిన్ కానుంద‌ట‌.

 

Share post:

Latest