సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ హీరోయిన్ …?

ప్రస్తుత కాలం అంతా సోషల్ మీడియా వేదికగా నడుస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఎంతోమంది స్టార్స్, సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసి వారి అభిమానులకు చేరువ అయ్యారు. ఈ క్రమంలో కోలీవుడ్‌లోని ప్రముఖ హీరోయిన్ జ్యోతిక మాత్రం అందుకు బిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆమె ఇప్పటిదాకా సోషల్ మీడియాలో అకౌంట్ లేకపోవడం గమనార్హం.అయితే జ్యోతికను అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. వారికి జ్యోతికకు సంబందించిన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ లో జరిగే ఏ విషయాలు తెలియడం లేదు అని ఒకింత విచారంలో ఉండి పోయారు. కానీ ఇప్పుడు అభిమానుల కోరిక మేరకు జ్యోతిక వారందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది.

ఎన్నో రోజుల తరువాత జ్యోతిక ఒక సరికొత్త ఫొటోలతో సోషల్ మీడియాలో అడుగు పెట్టింది.ఈ సందర్బంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫస్ట్ పోస్ట్ కు విశేష స్పందన లభించింది. అలాగే ఫొటోలతో పాటు ‘అందరికీ నమస్కారం. సోషల్ మీడియాలో నా లాక్డౌన్ డైరీలో నుండి కొన్ని ఫొటోలు మీకోసం షేర్ చేస్తున్న అని జ్యోతిక కాశ్మిర్ ట్రిప్ ఫోటోలు కొన్ని షేర్ చేసింది.జ్యోతిక పోస్ట్ పెట్టిన రెండు గంటల్లోనే 1.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. అలాగే జ్యోతిక మొదటి పోస్ట్ కు దాదాపు 269,155 లైక్‌లు వచ్చాయి.జ్యోతికకు సోషల్ మీడియాలోకి వెల్కమ్ చెబుతూ నెటిజన్లు కామెంట్స్ చేయడంతో పాటు ఆమె భర్త, టాప్ హీరో సూర్య సైతం జ్యోతిక సోషల్ మీడియా ఎంట్రీపై ఆనందం వ్యక్తం చేశారు.

 

 

View this post on Instagram

 

A post shared by Jyotika (@jyotika)

Share post:

Popular