జంతువులే సినిమాలను హిట్ చేశాయా..

మన సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథ, కథనం తో పాటు హీరో హీరోయిన్లు, డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఇలా అందరూ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇక అంతే కాదు సినిమా విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడాల్సి వుంటుంది. కానీ ఇక్కడ కొన్ని సినిమాలు నటీనటులతో పాటు పక్షులు,జంతువులు కూడా పలు క్యారెక్టర్లు చేసి సినిమాను సూపర్ హిట్. అయితే ఆ సినిమాలు ఏంటో మీరు ఒక లుక్ వేయండి..

1. రాజేంద్రుడు – గజేంద్రుడు :
1993 లో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం రాజేంద్రుడు-గజేంద్రుడు. ఈ సినిమాలో ఏనుగు కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాకోసం పిల్లలు పెద్దలు కలిసి మరీ సినిమా థియేటర్ లకి వెళ్లడం గమనార్హం.

2. సాహస వీరుడు సాగర కన్య :
వెంకటేష్ హీరోగా, శిల్పాశెట్టి ,మాల శ్రీ హీరోయిన్లుగా సంయుక్తంగా కలిసి నటించిన చిత్రం సాహస వీరుడు సాగర కన్య.. ఇక ఇందులో శిల్పా సాగరకన్య గా నటించి సినిమా హిట్ అవడానికి కారణం అయింది.

3. ఈగ :
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఈగ. ఈ సినిమాకు ఈగ హైలెట్ అని చెప్పవచ్చు.

ఇవే కాకుండా గోదావరి, మృగరాజు , సాహస బాలుడు విచిత్ర కోతి, అదుగో వంటి సినిమాలలో జంతువులు ప్రముఖ పాత్ర పోషించాయి. ఈ జంతువుల కారణంగానే సినిమాలు సక్సెస్ అయ్యాయి అని చెప్పవచ్చు.

Share post:

Popular