గోపీచంద్ వ‌చ్చేస్తున్నాడు..`సీటీమార్` రిలీజ్‌కు డేట్ లాక్‌!

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `సీటీమార్‌`. సంపత్‌ నంది దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం కబడ్డీ నేపథ్యంలో రూపుదిద్దుకుంది. శ్రీ‌నివాస సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకోగా.. క‌రోనా కార‌ణంగా విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.

అయితే ప్ర‌స్తుతం క‌రోనా ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. థియేట‌ర్లు కూడా ఓపెన్ అవ్వ‌డంతో.. సినిమాల‌న్నీ ఒక్కొక్క‌టీ విడుద‌ల అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే గోపీచంద్ కూడా వ‌చ్చేస్తున్నాడు. అవును, తాజాగా సీటీమార్ రిలీజ్‌కు డేట్ లాక్ చేసిన‌ట్టు తెలియ‌జేస్తూ మేక‌ర్స్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

దాని ప్ర‌కారం.. ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదల కాబోతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా, ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ కోచ్‌గా, తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్ గా క‌నిపించ‌నున్నారు. అలాగే ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.

Image

 

Share post:

Latest