ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్న సీనియర్ నటుడు టాలీవుడ్ హీరో రాజశేఖర్ , ఆయన కొన్ని సినిమాలలో ఏడుస్తూ..మనల్ని ఏడిపిస్తూ..ఇక ఎన్నో సినిమాలను చేశాడు. అందులో మా అన్నయ్య , గోరింటాకు లాంటి సినిమాలు మరెన్నో తీశాడు. రాజశేఖర్ అన్ని రకాల ఎమోషనల్స్ ను సినిమాల రూపంలో తెరమీద చూపించాడు. మరియు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ స్పీడు పెంచాడు. రాజశేఖర్ కల్కి సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది. రాజశేఖర్ ఇప్పుడు కొన్ని వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మధ్యమధ్యలో కొద్దిగ రెస్ట్ తీసుకుంటున్నాడు.ఇకపోతే కొత్తగా రాజ్ శేఖర్ ఒక సినిమాలో నటిస్తున్నాడు. అందుకని అరకు వెళ్ళిన రాజశేఖర్ తన కూతురు శివాత్మికతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ రేపుతున్నాయి.

తండ్రి , కూతురు అరకు అందాలను ఆస్వాదిస్తూ, ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక రాజ్ శేఖర్ సినిమాకు లలిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. లక్ష్మి ప్రొడక్షన్స్ పెగాసస్ సినీ కార్ప్ పతాకం పై ఎన్. ఎల్ .వి సత్యనారాయణ , శివానీ శివాత్మిక ,వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు.

రాజశేఖర్ ది ఇది 91వ సినిమా కాగా ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ షూటింగ్ నెలా ఖరులోగా కంప్లీట్ అవుతుందని మేకర్స్ పేర్కొంటున్నారు. కాగా రాజశేఖర్ ఫ్యామిలీ మూవీ యూనిట్లలో పాటు అరకు లో ఉన్నారు. ఆయన ఒకవైపు షూటింగ్ చేస్తూ మరొకవైపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ అరకులో ఉన్నారు.

ఈ సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ ఈ మూవీ తరువాత గతం డైరెక్టర్ కిరణ్ కొండమడుగు లా డైరెక్టర్లతో ఒక ఇంట్రెస్టింగ్ మూవీ తీయబోతున్నాడు. రాజశేఖర్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రం, కంచరపాలెం ముగిసిన తరువాత కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ డైరెక్టర్ వెంకటేష్ మహతో ఈ చిత్రం రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత చందు తో కలిసి ఇంకో సినిమాలు నటించబోతున్నాడు..ఇక రాజశేఖర్ చాలా సినిమాల్లో బిజీగా ఉన్నాడు. అని చెప్పవచ్చు.