ఎవరు మీలో కోటీశ్వరులు షో.. వీరిలో ఎవరి వల్ల హిట్ అయింది..?

ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఎంత మంచి దోస్తులో మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా వీరిద్దరి మధ్య లో మహేష్ బాబు కూడా ఉన్నారు. ఇక వీరు ముగ్గురు ఎంతో మంచి స్నేహితులని సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం RRR సినిమాలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఎన్టీఆర్ హోస్టుగా నిన్న రాత్రి”ఎవరు మీలో కోటీశ్వరులు” షో ను ప్రారంభించడం జరిగింది. అయితే ఆ షోలో విభిన్నమైన అటువంటి ప్రశ్నలతో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ను సతమతం చేశాడు. అంతేకాకుండా తనదైన శైలిలో రామ్ చరణ్ సమాధానాలిస్తూ ఎన్టీఆర్ కు వేగంగా సమాధానాలు చెప్పుకొచ్చాడు. ఇక అంతే కాకుండా ఇందులో రామ్ చరణ్ తనకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా షేర్ చేయడం జరిగింది.

ఇక ఎన్టీఆర్ గురించి కూడా పలు విషయాలు తను నటిస్తున్నటువంటి సినిమాల గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశాడు. ఇక ఆ షో లో ఎన్టీఆర్, రామ్ చరణ్ తన అభిమానులు మా హీరో వల్ల హిట్ అయిందంటే, మా హీరో వల్ల హిట్ అయింది అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే ,ఇక్కడ వీరిద్దరూ కలిసి పాటిస్పేట్ చేయడం వల్ల, ఈ షో హిట్ అయినట్లు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నది.

ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి తమ హీరోలు అందరం సమానమే అని కొన్ని సార్లు చెప్పకు రావడం జరిగింది. ఇక ఈ మధ్య కాలంలో కూడా వీరు అలాగే ప్రవర్తిస్తున్నారు.