ఇక మీదట రేషన్ కార్డు కావాలంటే అది తప్పనిసరి..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులను తగ్గించే స్థితిలో ఉన్నది ప్రభుత్వం. అందుచేతనే వాటికి ఎన్నో కండిషన్లు పెట్టి దాదాపుగా ఎన్నో లక్షల మంది రేషన్ కార్డులను కూడా తీసేసింది. అయితే ఇక ప్రస్తుతం ఈకేవైసీ తో బియ్యం కార్డును ముడి పెట్టడం తో.. ఇక ఎంతమందికి రేషన్ కార్డులు తొలగిస్తారో వేచి చూడాల్సిందే. అయితే ఈకేవైసీ నమోదు చేసుకోకపోతే, ఆ వ్యక్తి రేషన్ కార్డు లో నుంచి తొలగించబడుతారట.

ఈకేవైసీ చేయించక పోవడం వల్ల ఇతర వస్తువులను పొందే వీలు ఉండదు. రేషన్ కార్డు లో ఎంత మంది ఉంటే అంత మంది కంపల్సరిగా ఈకేవైసీ నమోదు చేయించుకోవాలి. ఈ విషయాన్ని ఏపీ పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం 1.48 కోట్ల రేషన్ కార్డ్ లు ఉండగా..4 కోట్ల మందికి పైగా సభ్యులు ఉన్నారు. ఇక వీరిలో 85 శాతం మందికి ఈకేవైసీ నమోదు చేయబడింది.

ఇంకా 35 లక్షల మందికి పైగా నమోదు చేయించుకోని వారు ఉన్నారు. ఇక వారందరి వివరాలను తప్పక నమోదు చేయాలని కేంద్రం ఆదేశించడంతో పౌరసరఫరాల శాఖ దీనిపై దృష్టి పెట్టింది. రేషన్ కార్డులలో ఎవరికైనా ఈకేవైసీ కాలేదో , వారికి రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేయబడుతుంది. లేదా వాలంటరీల ద్వారా వాటిని పంపిణీ చేయిస్తారు. ఇందులో పేర్లు ఉన్న వారంతా ఈనెల లోపు ఈకేవైసీ చేయించుకోవాలని స్పష్టం చేసింది ప్రభుత్వం.

ఇక దీంతో ఆధార్ వేలిముద్రలు పడనివారు మీ సేవ కేంద్రాలు, పోస్ట్ ఆఫీస్ కార్యాలయం దగ్గరకు పరుగులు తీస్తున్నారు. దీంతో అనేక చోట్ల లైన్లో నిల్చున్నారు ప్రజలు. అంతేకాకుండా ఐదు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు ఈకేవైసీ చేయించుకొని , వాటి వివరాలను అందించాల్సిందిగా తెలిపింది ఏపీ ప్రభుత్వం. పెద్దవారు అయితే నెలాఖరులోపు చేయించుకోవాలి. చిన్నపిల్లలకు అయితే సెప్టెంబర్ నెలాఖరు వరకు పొడిగించడం జరిగింది.