కృతి శెట్టి చేసిన ప‌నికి డైరెక్ట‌ర్ ఆగ్ర‌హం..అంద‌రి ముందూ చివాట్లు?

`ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ కృతి శెట్టి.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ నేప‌థ్యంలోనే ఆమెకు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్లు కృతి వైపే చూస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం ఈ భామ‌.. నాని స‌ర‌స‌న శ్యామ్ సింగ‌రాయ్‌, సుధీర్ బాబు స‌ర‌స‌న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాల్లో న‌టిస్తోంది.

Fany rate for RaPo19 audio rights

అలాగే లింగుసామి, రామ్ పోతినేని కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రంలోనూ కృతి శెట్టినే హీరోయిన్‌. ఈ మూవీ షూటింగ్ హైద‌ర‌బాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే ఇటీవ‌ల ఈ చిత్రంలో ఓ సన్నివేశం షూట్‌ చేస్తుండ‌గా కృతిశెట్టి చేసిన ప‌నికి డైరెక్ట‌ర్ లింగుసామి కాస్త ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ట‌.

Southsuper - Lingusamy fires on Krithi Shetty: RAPO19 - Entrendz Showbizz

ఈ చిత్రంలో సీనియర్‌ నటుడు నాజర్‌-కృతిశెట్టిల సెంటిమెంట్‌ సీన్‌ షూట్‌ చేస్తుండగా సరైన ఎక్స్‌ప్రెషన్స్‌ను కృతి ప‌ల‌క‌లేక‌పోయింద‌ట‌. అప్పటికే చాలా టేకులు తీసుకున్న‌ప్ప‌టికీ.. సరిగ్గా పర్‌ఫార్మ్ చేయ‌లేక‌పోయింద‌ట. దాంతో విసిగిపోయిన లింగుసామి.. సెట్‌లో అంద‌రు చూస్తుండ‌గానే కృతికి చివాట్లు పెట్టార‌ట‌. అనంత‌రం షాట్ తీయ‌గా.. కృతి అద్భుతంగా న‌టించింద‌ని తెలుస్తోంది.

Share post:

Popular