చిరు సినిమా కోస‌మే చ‌ర‌ణ్ ఎన్టీఆర్ షోకి వ‌చ్చాడా??

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్గెస్ట్ గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` నిన్న గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ప్రారంభ ఎపిసోడ్‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స్పెష‌ల్ గెస్ట్‌గా పాల్గొన్నాడు. హాట్ సీట్‌లో చ‌ర‌ణ్‌, హోస్ట్ సీట్‌లో ఎన్టీఆర్ కూర్చుని షోను రంజుగా మార్చి ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేశారు.

Evaru Meelo Koteeswarulu | NTR | Coming soon on Gemini TV - YouTube

ఈ షోలో ఎన్టీఆర్‌తో చ‌ర‌ణ్ అనేక విష‌యాల‌ను పంచుకున్నాడు. ఈ క్ర‌మంలోనే తండ్రి చిరంజీవి న‌టిస్తున్నఆచార్య సినిమాను కూడా హైలైట్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు చ‌ర‌ణ్‌. పైగా ఎన్టీఆర్ సైతం చ‌రణ్ ని గురువు అనే అర్థం వచ్చే పదం ఏది అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. వాటిలో ఆచార్య కూడా ఉంది. అంతే చరణ్ వెంటనే `ఆచార్య` అని సరైన సమాధానం ఇచ్చాడు.

Chiranjeevi and Ram Charan's Acharya release postponed due to Covid-19 spike - Movies News

ఆ తర్వాత వీరిద్దరి మధ్య చిరంజీవి న‌టిస్తున్న‌ ఆచార్య చిత్రం గురించి కాసేపు ముచ్చ‌ట్లు పెట్టేశారు. దాంతో షోలో చ‌ర‌ణ్ తీరును చూసి ప‌లువురు నెటిజ‌న్లు ఆచార్య‌ను ప్ర‌మోట్ చేయ‌డానికే ఎన్టీఆర్ షోకి వ‌చ్చాడా? అన్న సందేహాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవితో పాటుగా చ‌ర‌ణ్ కూడా న‌టిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది.

Share post:

Latest