చిరంజీవిని సినిమాల్లోకి రావడానికి కారణం అతనేనా..?

మెగాస్టార్ చిరంజీవి 151 సినిమాలలో నటించాడు. అంతే కాదు ఈయన 66 వ ఏట కూడా యువతరంతో పోటీ పడుతూ,బిగ్ ఛాలెంజెర్ గా మారారు. ఈయన కొణిదెల వెంకట్ రావు, శ్రీమతి అంజనా దేవి దంపతులకు 1955 ఆగస్టు 22న మొదటి సంతానంగా జన్మించారు.

మన చిరంజీవి గారికి మొదట తల్లిదండ్రులు పెట్టిన పేరు శివ శంకర్ ప్రసాద్ . ఆ పేరుతోనే విద్యాభ్యాసం అంతా ముగిసింది. 1975లో ఇదే పేరుతో నాటక రంగం లోకి అడుగు పెట్టాడు. ఇక ఈయన నటించిన రాజీనామా అనే మొదటి సినిమాకు ఉత్తమ నటుడు అవార్డును కూడా గెలుచుకున్నాడు.

మన మెగాస్టార్ తను చదువుకునే రోజుల్లో స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా నాటకం చేశాడు. ఆ నాటకానికి ఉత్తమ నటుడిగా అవార్డు గెలుపొందాడు. ఇలాంటి అవార్డు లు ఆయనను ఆలోచించేలా చేశాయి
డిగ్రీ చదివేటప్పుడు ఎన్.సీ.సీ తరఫున నిలబడి ఢిల్లీ వెళ్లారు. ఆనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ దగ్గర పోతురాజు పోలేరమ్మ నాటకం వేయడం విద్యార్థి జీవితంలో మర్చిపోలేనిది.

1977లో ఈయన డిగ్రీ పట్టా పొందాడు.ఆ తరువాత తన తండ్రి ఐ సి డబ్ల్యు కోర్స్ లో చేరాడు.. కానీ కొణిదల శంకర్ ప్రసాద్ చెన్నై చేరారు. మరియు అడయార్ వర్మ టీ స్టాల్ లో చేరారు. చిరంజీవి గారు 1978లో ఫిలిం సిటీలో నటన శిక్షణ పూర్తి చేశారు.ఇకనాటి నుంచి నేటి వరకూ ఇలాంటి నటుడు తెర మీదకు రాకపోయినా , అందుకు ఆయన తండ్రి కొణిదల వెంకట్రావు గారు అంగీకరించకపోయినా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి హీరోని కోల్పోయేది. అనే మాట నిస్సందేహంగా చెప్ప వచ్చు.

మెగాస్టార్ చిరంజీవి వల్ల ఎంతోమంది రక్తదాతల అయ్యారు. ఎందుకంటే ఆయన కొద్దికాలం కిందట రక్త శిబిరాలను ఏర్పాటు చేశారు. చాలా మంది ప్రజలను ఆదుకున్నారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే.. ఆయన మంచితనానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు. కొణిదెల ఇంట వరం పుట్టింది అని చెప్పుకోవచ్చు.