`మా` వార్‌..సీన్‌లోకి చిరు..వారిని వ‌దిలేది లేదంటూ సీరియ‌స్‌!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌ల వ్య‌వ‌హారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ఈ సారి ఏకంగా ఐదుగురు అభ్య‌ర్థులు పోటీ ప‌డ‌ట‌మే కాకుండా.. ఒక‌రిపై ఒక‌రు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇక ఇటీవ‌ల ‘మా’ అసోసియేషన్‌ నిధులను అధ్యక్షుడు నరేష్‌ ఇష్టానుసారం ఖర్చు చేస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ హేమ ఆరోపించారు.

ఆమె ఆరోపణలను ఖండించిన నరేష్ రివ‌ర్స్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి ఎన్నిక‌ల హీట్‌ను పెంచారు. ఇలాంటి త‌రుణంలో మెగాస్టార్ చిరంజీవి సీన్‌లోకి ఎంట‌ర్ అయ్యారు. తాజాగా మా ఎన్నిక‌ల‌పై స్పందించిన చిరంజీవి..ఎన్నికలు వెంటనే జరపాలని, ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని పేర్కొన్నారు.

అంతేకాకుండా `మా` ప్రతిష్ట దెబ్బతీస్తున్న ఎవరినీ వ‌దిలేది లేద‌ని.. అలాంటి వారిని ఉపేక్షించవద్దంటూ మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణం రాజుకు చిరు లేఖ రాశారు. ఎవరికైనా అభిప్రాయభేదాలు, మనస్పర్థలు ఉంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి తప్పితే బహిరంగంగా విమర్శలు చేయడం మంచిది కాదన్నది చిరు సీరియ‌స్ అయ్యారు.