BREAKING: సీఎం జగన్ బెయిల్ రద్దు తీర్పు వాయిదా…!

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై బుధవారం సీబీఐ కోర్టు విచారించింది. ఈ విషయమై ఏపీలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వైసీపీ శ్రేణులు తమ అధినేత భవితవ్యం ఎలా ఉండబోతుందని ఆందోలన చెందుతున్న క్రమంలో జగన్‌కు కోర్టు రిలీఫ్ ఇచ్చిందనే చెప్పొచ్చు. సీబీఐ హైకోర్టు ఇప్పటి వరకు ఇరువైపుల నుంచి అనేక వాదనలు విన్న తర్వాత ఎలాగైన తుది తీర్పు ఇస్తుందని అందరూ భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీబీఐ కోర్టు కేసును సెప్టెంబర్ 15వ తేదీ వరకు వాయిదా వేసింది.

ఈ రోజు జగన్ పిటిషన్‌తో పాటు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్‌పైన కూడా విచారణ జరిగింది. అయితే, ఆ తీర్పు కూడా వాయిదా పడింది. దీంతో వైసీపీ కార్యకర్తలు, నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే వైసీపీ పార్టీలోని అంతర్గత విభేదాలు కొంత కాలం నుంచి బయటపడుతున్నాయి. వైసీపీలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు అస్సలు పడట్లేదని వార్తలొస్తున్నాయి. ఇకపోతే వైఎస్ జగనన్‌ను నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తున్న సంగతి అందరికీ విదితమే.